Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విశాఖపట్నం: విశాఖ- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలు విశాఖపట్నంలో గురువారం ఉదయం 5.45 గంటలకు బదులు నాలుగు గంటలు ఆలస్యంగా 9.45 గంటలకు బయలుదేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. బుధవారం ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ వస్తుండగా.. ఖమ్మం- విజయవాడ మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. దీంతో సీ8 బోగీ అద్దం పగిలిపోయింది. దెబ్బతిన్న అద్దాన్ని మార్చాల్సి ఉండటంతో రైలు ఆలస్యంగా బయలుదేరనుంది.