Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 8న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభ ఉంటుంది. ఈ మేరకు ఆయన షెడ్యూలు ఖరారైంది. 8న (శనివారం) ఉదయం 11.30 గంటలకు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత 1.30 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.