Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. దీంతో కోటం రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పొట్టేపాళెం కలుజు వంతెన రిపేర్లపై జలదీక్షకు కోటంరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్ గతంలో వంతెన రిపేర్ల కోసం రూ.26 కోట్లు కేటాయించారు. సీఎం సంతకం చేసినా కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో ఎమ్మెల్యే కోటం రెడ్డి ఇంటి దగ్గర అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా అనుచరులు నినాదాలు చేస్తున్నారు. పొట్టేపాలెం కలుజు వద్ద జలదీక్షకు వెళ్లనివ్వకుండా తెల్లవారు జామున ఇంటి వద్ద పోలీసు అధికారులు అడ్డుపడ్డారని కోటంరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పై పోరాడటం, స్పందించటం తప్పా? గత 4 సంవత్సరాలు గా ఎన్నో సార్లు సమస్య పరిష్కారం కోసం ప్రశ్నించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం కోసం ఉత్తుత్తి జిఒ కాకుండా, ఆర్థిక శాఖ ఆమోదంతో కూడిన జిఒ విడుదల చేసి సమస్య పరిష్కారం చేయాలని కోటం రెడ్డి డిమాండ్ చేశారు.