Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ గురువారం 42 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ నుంచి హస్తం గూటికి చేరిన బాబూరావు చిచన్సూర్, ఎన్వై గోపాలకృష్ణలకు చోటు దక్కింది. బాబూరావు గుర్మిత్కల్ సీటు నుంచి బరిలో దిగనుండగా, గోపాలకృష్ణ మొల్కల్మూర్ నుంచి పోటీ చేయనున్నారు. బసవరాజ్ బొమ్మై సారధ్యంలోని పాలక బీజేపీ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అభ్యర్ధుల ఎంపికను ఆచితూచి చేపట్టడంతో పాటు ముఖ్యనేతల మధ్య సమన్వయంతో ముందుకెళుతోంది.