Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముంబయిః డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ వినియోగాన్ని ముందస్తుగా మంజూరు చేసిన 'క్రెడిట్ లైన్'కు కూడా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు బ్యాంకుల్లో ఉండే డిపాజిట్ ఖాతాల మధ్యనే జరుగుతున్నాయి. కొన్ని సార్లు వాలెట్ల వంటి ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా కూడా యూపీఐ లావాదేవీలు సాధ్యమవుతున్నాయి. ఇప్పుడు యూపీఐ వినియోగాన్ని డిపాజిట్ ఖాతాలతో పాటు క్రెడిట్ లైన్లోని నిధుల బదిలీలకు కూడా విస్తరిస్తున్నాం. మరో రకంగా చెప్పాలంటే బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ లైన్ల ద్వారా కూడా లావాదేవీలు జరపడానికి యూపీఐ నెట్వర్క్ వీలు కల్పిస్తుంది అని ఆర్బీఐ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని వెల్లడించింది.