Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో బడ్జెట్‌పై చర్చ నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ ప్రభుత్వం అదానీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. చర్చ లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ను చర్చ లేకుండా 12 నిమిషాల్లో ఆమోదించారని ఖర్గే అన్నారు. అదానీ-హిండెన్‌బర్గ్‌పై చర్చించేందుకు మోడీ సర్కార్ ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప.. ప్రధానికి ప్రజల బాధలు తెలియవన్నారు. పార్లమెంట్లో మేం మాట్లాడకుండా బీజేపీ అడ్డుకుందన్నారు. సభలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దేశ సంపదను కాపాడేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు.రాహుల్ గాంధీ విషయంలో మెరుపు వేగంతో నిర్ణయం తీసుకున్నట్లు ఖర్గే ఆరోపించారు.