Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రతి ఏటా తాను హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటానని, ఎప్పటిలాగే శోభాయాత్రకు వెళ్లాలనుకుంటున్న తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణలో 8వ నిజాం పాలన నడుస్తోందని మండిపడ్డారు. గౌలిగూడ రామమందిరంలో పూజలు నిర్వహించి శోభయాత్రలో పాల్గొనడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తనను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఘాటు విమర్శలు చేశారు. దూల్పేట్లోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం సమీపంలో రాజా సింగ్ను అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుండి బొల్లారం స్టేషన్కు తరలించారు.