Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను గతేడాది మే నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సత్యేందర్ జైన్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జైన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జైన్ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం. జైన్ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అందువల్ల ఆయన బయటకొస్తే ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని సింగిల్ బెంచ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు బెయిల్ మంజూరుకు నిరాకరించింది.