Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొత్త పార్టీ పై స్పష్టతనిచ్చారు. ఈ తరుణంలో కార్యకర్తలను అయోమయానికి గురిచేసేలా కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తాను వీడే ప్రసక్తే లేదని తెలిపారు.
ఢిల్లీలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పలువురు కేంద్రమంత్రులను కలిసినప్పటికీ అది అభివృద్ధి కార్యక్రమాల కోసమేనని కోమటిరెడ్డి తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ దేనికి పోటీ చేయమంటే దానికి పోటీ చేస్తానన్నారు. తనకు పార్టీ మారే ఉద్దేశముంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోయినపుడే మారే వాడినన్నారు. నిరాధార వార్తలతో కాంగ్రెస్ కార్యకర్తలను గందరగోళానికి గురిచేయొద్దని కోమటిరెడ్డి కోరారు.