Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లో ఓ అమ్మాయి కోపంలో మొబైల్ ఫోన్ మింగేసింది. భింద్ జిల్లాలో ఓ బాలిక తన సోదరుడితో ఫోన్ విషయంలో గొడవ పడింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ తరుణంలో పట్టరాని కోపం వచ్చిన ఆ అమ్మాయి ఏకంగా మొబైల్ ను మింగేసింది. కొంతసేపటి తర్వాత వాంతులు, విపరీతమైన కడునొప్పితో బాద పడింది. అసలు విషయం తెలసుకున్న తల్లిదండ్రులు వెంటనే గ్వాలియర్ హాస్పిటల్ కి తరలించి ఆపరేషన్ చేయించారు. తన కడుపులోనుంచి మొబైల్ ఫోన్ తొలగించారు. దీంతో ఆ అమ్మాయికి పెను ప్రమాదం తప్పింది.