Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగిశాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో అధిక భాగం వాయిదాల పర్వమే కొనసాగింది. దీంతో ఉభయ సభలు షెడ్యూల్ కంటే చాలా తక్కువ సమయమే పనిచేశాయి. మలివిడత బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ మొత్తం 45 గంటలు, రాజ్యసభ31 గంటల పాటు పనిచేసిందని ఓ థింక్థాంక్ సర్వే డేటా వెల్లడించింది. అయితే పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారం ఉభయ సభలను కుదిపేసింది.
లోక్‌సభ మొత్తం 133.6 గంటలు పనిచేయాల్సి ఉండగా కేవలం 45 గంటలు (34.28శాతం) పనిచేసింది. ఇక రాజ్యసభను 130 గంటలు నిర్వహించాల్సి ఉండగా 31 గంటల (24శాతం) పాటు మాత్రమే పనిచేసిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసర్చ్ డేటా వెల్లడించింది. లోక్‌సభలో 4.32 గంటలు, రాజ్యసభలో 1.85 గంటలు ప్రశ్నోత్తరాల కోసం కేటాయించారు. ఈ ఉదయం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బడ్జెట్ సమావేశాలు ముగిసినట్లు ప్రకటిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 13.44 గంటల పాటు చర్చ జరగ్గా 143 మంది ఎంపీలు పాల్గొన్నట్లు వెల్లడించారు.