Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ -4 మెయిన్ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గురువారం ప్రాథమిక పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఆన్లైన్లో జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ లోపు ఆన్లైన్లో తెలియజేయవచ్చని అభ్యర్థులకు సూచించింది.