Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్ష ఫలితాలను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వై మల్లేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం గత ఫిబ్రవరి నెలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం రెగ్యులర్తోపాటు బ్యాక్లాగ్ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో 77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
మొదటి సంవత్సరం పరీక్షల్లో 5369 మంది పరీక్షలకు హాజరుకాగా, 4134 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇందులో 127 మంది డిస్టింక్షన్, 2240 మంది ప్రథమ శ్రేణిలో నిలువగా, మిగిలిన 1767 మంది విద్యార్థులు ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో ఉత్తీర్ణత చెందారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్ని పరిశీలించవచ్చునని తెలిపారు.