Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ప్రారంభించిన లహరి ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులు గురువారం రోజు హైదరాబాద్ లో హైదరాబాద్ – తిరుపతి , హైదరాబాద్ – చెన్నై మధ్య రెండు ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏసీ స్లీపర్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు బీహెచ్ఈఎల్ వద్ద బయల్దేరుతుంది. సాయంత్రం 6:20 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మళ్లీ తిరుపతి నుంచి అదే రోజు రాత్రి 7:40 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8 గంటలకు బీహెచ్ఈఎల్కు చేరుకోనుంది.
అంతే కాకుండా హైదరాబాద్ – చెన్నై మార్గంలో ప్రయాణించే ఏసీ స్లీపర్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:25 గంటలకు బీహెచ్ఈఎల్ వద్ద బయల్దేరి, ఎంజీబీఎస్‌కు 6:20 గంటలకు చేరుకోనుంది. ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 7:30 గంటలకు చెన్నై నుంచి బస్సు బయల్దేరును. మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8:20 గంటలకు బీహెచ్ఈఎల్కు చేరుకోనుంది. ఈ బస్సుల్లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు 040-69440000 లేదా 040-23450033 నంబర్లను సంప్రదించొచ్చు. లేదా www.tsrtconline.in. అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.