Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిప్పంటించుకున్నబాధిత వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో ఈ దేశాన్ని కాపాడండి అంటూ మోడీకి వ్యతిరేకంగా అతను నినదించాడు. బాధిత వ్యక్తిని రోహిణికి చెందిన రాజ్‌కుమార్ శర్మగా పోలీసులు గుర్తించారు.