Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
తన కుమారుడు అనిల్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అతడి నిర్ణయం తప్పని ఈ క్షణం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని విభజించేందుకు, ప్రజాస్వామ్య పునాదులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ల భావజాలాన్ని తాను ఎప్పటికీ సమర్థించబోనన్నారు.
బీజేపీ, ఆరేస్సెల మతతత్వ, విభజన అజెండాకు తానెప్పటికీ వ్యతిరేకమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నానని, భారతదేశాన్ని ఏకతాటిపై ఉంచడంతోపాటు భిన్నత్వాన్ని గౌరవించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నానని ఇంకా ఎంతకాలం బతుకుతానో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. కానీ జీవించినంత కాలం కాంగ్రెస్ కోసమే ఉంటానన్నారు.