Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తిరుమలలో లేపాక్షి సర్కిల్ వద్ద మతిస్థిమితం లేని ఓ వక్తి హల్ చల్ చేశాడు. మద్యం కావాలంటూ షబ్ వే బ్రిడ్జ్ పైకి ఎక్కి నిరసనకు దిగాడు. కింది నుంచి చాలా మంది వారించినా వినకుండా 20 అడుగుల ఎత్తు నుంచి దూకిండు. బాధితుడిని కాపాడుదామని ప్రయత్నించిన విజిలెన్స్ సిబ్బంది కూడా పడిపోయాడు. దీంతో టీటీడీ సిబ్బందితో పాటు అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మతిస్థిమితం లేని వ్యక్తి జహీరాబాద్ కు చెందిన మహేష్ గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో నరేష్ అనే విజిలెన్స్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరిని స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.