Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆ తరుణంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు. మోనప్ప జంక్షన్ టివోలి జంక్షన్ సెయింట్ జాన్ రోటరీ సంగీత్ క్రాస్ రోడ్ చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్, ఆర్పీరోడ్ ఎస్పీ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ క్రమంలో పలు జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని తెలిపారు.
మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం) – గ్రీన్లాండ్స్ – ప్రకాశ్‌నగర్ – రసూల్‌పురా – సీటీవో – ప్లాజా – ఎస్బీహెచ్ – వైఎంసీఏ – సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్‌రోడ్ – ఆలుగడ్డ బావి – మెట్టుగూడ – చిలకలగూడ – బ్రూక్ బాండ్ – టివోలి – బాలమ్రాయ్ – స్వీకర్ ఉపకార్ – సికింద్రాబాద్ క్లబ్ – తిరుమలగిరి – తాడ్‌బండ్ – సెంట్రల్ పాయింట్ మార్గాల్లో ప్రయాణించొద్దని సూచించారు. టివోలి క్రాస్‌రోడ్ నుంచి ప్లాజా క్రాస్రోడ్ల మధ్య ఉన్న రోడ్డును మూసివేయనున్నట్లు తెలిపారు. ఎస్బీఎస్ క్రాస్రోడ్ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డును మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ప్రయాణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను విజ్ఞప్తి చేశారు.