Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్లో ఉండటమే కాకుండా, ఎదురు తమకే బంపర్ ఆఫర్లు ఇస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కరికి సీటిస్తామని హామీ ఇస్తే నలుగురు ఎమ్మెల్యేలు వస్తామంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. మేం టీడీపీలోకి వెళ్లం వైసీపీతోనే మా జీవితం అంటూ గంభీరంగా చెప్పే వాళ్లే బంపర్ ఆఫర్ ప్రకటించిన జాబితాలో ముందున్నారని అచ్చెన్న స్పష్టం చేశారు. వైసీపీలో తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయిందన్నారు. తమతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల జాబితా చెప్పాలని మంత్రులు డిమాండ్ చేయడం పిచ్చితనమని విమర్శించారు. వైసీపీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకతతో మంత్రులు ధర్మాన, బొత్స సత్యనారాయణ ఉద్దేశ పూర్వకంగానే బ్యాలెన్స్ తప్పుతున్నారని ఎద్దేవా చేశారు.