Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్
ఒక కార్యక్రమంలో ఐస్‌క్రీమ్ తిన్న 55 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 25 మంది పిల్లలు కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతల్ గ్రామంలోని ఒక ఆలయంలో బుధవారం రాత్రి మతపరమైన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దినేష్ కుష్వాహ అనే వ్యక్తి తయారు చేసి అమ్మిన ఐస్‌క్రీమ్‌ను పిల్లలు, పెద్దలు తిన్నారు. అనంతరం 55 మంది అస్వస్థత చెందారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడిన వారిని వెంటనే జిల్లా ఆస్సత్రికి తరలించారు. అయితే అనారోగ్యం పాలైన వారిలో 25 మంది పిల్లలు ఉన్నట్లు ఖర్గోన్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ తెలిపారు.