Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఆర్సీబీపై 81 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. 205 పరుగు టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగుళూరు..కోల్ కతా బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది.
205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ మంచి శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 44 పరుగులు జోడించారు. అయితే 21 పరుగులు చేసిన కోహ్లీ..నరైన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ డూ ప్లెసిస్ (23) కూడా పెవీలియన్ చేరాడు. ఇక అప్పటి నుంచి బెంగుళూరు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. మాక్స్ వెల్(5), హర్షల్ పటేల్(0), షాబాద్ అహ్మద్ (1), దినేష్ కార్తీ్క్ (9) అందరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఆర్సీబీ 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. వరుణ్ చక్రవర్తీ 4 వికెట్లు పడగొట్టాడు. సుయాన్ష్ శర్మ 3 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు.