Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని సమల్కా కపషేరా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కపషేరాలోని సోనియా గాంధీ క్యాంప్‌లో ఉన్న కలప గోదామ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా గోదామ్ మొత్తం మంటలు వ్యాపించాయి. గోదామ్‌లో కలప పెద్దసంఖ్యలో ఉండటంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 16 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఢిల్లీ అగ్నిమాపకశాఖ డివిజనల్ ఆఫీసర్ సత్పాల్ భరద్వాజ్ అన్నారు. మంటలను వీలైనంత త్వరగా అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటిక వరకు ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.