Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. ఇక కిందటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమి పాలైన లక్నోకు కూడా ఈ పోరు కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని జట్టు తహతహలాడుతోంది. మరోవైపు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ చేరికతో సన్‌రైజర్స్ కూడా బలంగా తయారైంది. కొంతకాలంగా బ్యాట్‌తోనే కాక కెప్టెన్సీలోనూ అదరగొడుతున్న మార్క్రమ్పై సన్‌రైజర్స్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇటీవల సౌతాఫ్రికా వేదికగా జరిగిన టి20 టోర్నమెంట్లో మార్క్రమ్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఐపిఎల్ టోర్నీలోనూ మార్క్రమ్ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక రాజస్థాన్‌తో జరిగిన తొలి పోరులో హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తికి విఫలమైంది. తొలుత బౌలర్లు, ఆ తర్వాత బ్యాటర్లు తేలిపోవడంతో హైదరాబాద్‌కు ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌లో ఓ ఒక్కరూ కూడా తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయారు. భారీ ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హారి బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, సుందర్ తదితరులు పూర్తిగా నిరాశ పరిచారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్ మాత్మే కాస్త రాణించారు. బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్‌కు రాజస్థాన్ చేతిలో 72 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.