Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దపల్లి పట్టణంలోని రింగంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. యూరియా లోడుతో హైదరాబాద్ వైపువెళ్తున్న లారీ.. రంగంపల్లి వద్ద రోడ్డుకు పక్కన ఆగి ఉన్నది. అయితే శుక్రవారం తెల్లవారుజామున బైక్వెళ్తున్న ఓ వ్యక్తి లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.