Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్లో కొత్తగా ఆరు వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. నానాటికీ కేసుల సంఖ్య ముందుకే పోతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. కేంద్రం తాజాగా శుక్రవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారత్లో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న(గురువారం) ఈ సంఖ్య 5,300గా ఉంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు యూపీ, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక కేసుల సంఖ్య పోను పోను పెరుగుతుండంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవియా ఇవాళ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు.