Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ ఆసీస్ పేసర్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్ సన్ గాయం కారణంగా టోర్నీకి దూరమైయ్యాడు. ఈ తరుణంలో రిచర్డ్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్ ను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. కనీస ధర రూ. 1.5 కోట్ల మెరెడిత్ తో ముంబై టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆస్ట్రేలియా తరపున కేవలం 5 టీ20 మ్యాచ్ లు ఆడిన మెరెడిత్ 8 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మూడు వికెట్లు హాల్ కూడా ఉంది. అయితే రిలే మెరెడిత్ కు ఇంతకు ముందు ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా ఉంది. మెరిడిత్ 2021లో ముంబై ఇండియన్స్ తరపున అరంగట్రం చేశాడు. గత రెండు సీజన్ ల పాటు ముంబైకే ప్రాతినిథ్యం వహించాడు. ముంబాయ్ ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ క్రమంలో ఆ స్టార్ ని ఎంపిక చేసుకున్నారు.