Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
లిక్కర్ స్కామ్లో జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇవాళ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ తరుణంలో ప్రధాని తన విద్యార్హతలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హిందీ భాషలో రాసిన లేఖను సిసోడియా రిలీజ్ చేశారు. దేశ ప్రగతి కోసం ఓ విద్యావంతుడైన వ్యక్తి ప్రధాని కావాలని తన లేఖలో తెలిపారు. ప్రధాని మోడీ తక్కువగా చదువుకున్నారని, అలాంటి వ్యక్తి దేశానికి ప్రమాదకరమని సిసోడియా తన లేఖలో తెలిపారు. మోదీజీకి సైన్స్ అర్ధం కాదన్నారు. ఆయన విద్య యొక్క విలువ తెలియదన్నారు.