Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. భవనంలో ఎక్కువ భాగం చెక్కతో చేసి ఉండడం వల్ల మంటలు భారీగా ఎగసిపడ్డాయని అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదానికి గురైన భవనంలో రెండు కుటుంబాలు ఉంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇళ్లలోని నలుగురు తప్పించుకున్నారు. మరో నలుగురు చిన్నారులు అధిరా, వికేశ్, త్రిలోక్, జైలాల్.. వనం లోపలే చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేశాయి. కానీ అప్పటికే భవనంలోని నలుగురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు.