Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. పట్టణంలో జరుగుతున్న కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్లో శనిగరం ఆంజనేయులు (37) పాల్గొన్నారు. ఈ తరుణంలో బౌలింగ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతుడిని చిగరుమామిడి మండలం సుందరగిరిగా గుర్తించారు.