Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూర్ : ఆన్లైన్ వేదికగా రోజుకో తరహా మోసంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. కర్నాటకకు చెందిన మహిళను స్కామర్లు యూట్యూబ్ చానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తూ ఆదాయం సమకూర్చుకోవచ్చని నమ్మించి ఏకంగా రూ. 8 లక్షలుపైగా దోచుకున్నారు. ఈతరుణంలో స్కామర్లు వాట్సాప్‌లో బాధితురాలిని సంప్రదించి ఆమెకు పార్ట్‌టైం జాబ్ ఆఫర్ చేశారు. యూట్యూబ్ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తే కమిషన్ వస్తుందని మభ్యపెట్టారు. ప్రతి యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 50 చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధి బాధితురాలిని నమ్మబలికాడు. ఆపై ఆఫర్‌కు ఆమె అంగీకరించడంతో సబ్‌స్క్రైబ్ చేయాల్సిన యూట్యూబ్ చానెల్స్ లింక్స్ పంపాడు.అ తరువాత రెండు చానెల్స్ సబ్‌స్క్రైబ్ చేయడంతో బాధితురాలికి మరొకరు కాల్ చేసి ఆమెను టెలిగ్రాం గ్రూప్‌లో చేర్చారు. తరువాత పలు టాస్క్‌ల పేరుతో మహిళ నుంచి రూ. 8 లక్షలు పైగా వసూలు చేసి ముఖం చాటేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు బెంగళూర్ సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.