Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జైపూర్
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ నలుగురి ప్రాణాలను బలి తీసుకొంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటం బాధాకరం. ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు ట్రాక్టర్‌ను దహనం చేసి.. మృతదేహాలతో రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గురువారం రాత్రి చోటు చోసుకుంది. ఎస్పీ ఆనంద్ శర్మ కథనం ప్రకారం..రాజస్థాన్ అల్వార్‌కు చెందిన ఓ కుటుంబం గురువారం టెంపోలో బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్న ఓ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భర్త, ముగ్గురు చిన్నారులు అక్కడిక్కడే మరణించారు. భార్యకు తీవ్ర గాయాలవ్వటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కథుమార్ ప్రాంతంలో చోటు చేసుకొంది. ఈ ప్రమాదంపై ఆగ్రహించిన అల్వార్ గ్రామస్థులు ట్రాక్టర్‌ను దహనం చేశారు. మృతదేహాలను రోడ్డుకు అడ్డంగా ఉంచి నిరసనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఇసుక అక్రమ రవాణాతో పోలీసులకు కూడా సంబంధం ఉందని గ్రామస్థులు ఆరోపించారు. పోలీసు వాహనంపై రాళ్లను రువ్వారు. దీంతో ఆ వాహనం ధ్వంసమైంది. అగ్నిమాపక సిబ్బందిని కూడా వారు అడ్డుకున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించేందుకు గ్రామస్థులను ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నించిగా.. తొలుత వారు తిరస్కరించారు. కొన్ని గంటల తరవాత మృతదేహాలను తరలించడానికి గ్రామస్థులు అంగీకరించారు.