Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు రేపటి నుంచి పరుగులు తీయనుంది. ఏప్రిల్ 8న హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్న ప్రధాని పచ్చజెండా ఊపి ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ ను ప్రారంభిస్తారు. ఈ తరుణంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.