Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గాజా: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. శుక్రవారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. హమాస్ టెర్రర్ గ్రూపునకు చెందిన సైట్లను టార్గెట్ చేసింది. పాలస్తీనా, లెబనాన్ నుంచి రాకెట్ల దాడి జరిగిన నేపథ్యంలో కౌంటర్‌గా ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్‌లో ఉన్న హమాస్ టెర్రరిస్టు కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది. లెబనాన్ నేల నుంచి హమాస్ ఉగ్రవాదుల కార్యకలాపాలను సాగనివ్వమని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి.పాలస్తీనా చేసిన దాడిలో ఇద్దరు మరణించినట్లు ఇజ్రాయిల్ మెడిక్స్ తెలిపారు.