Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్మీ.. భారత్ మార్కెట్లోకి నార్జో ఎన్55 ఫోన్‌ను ఈ నెల 12న తీసుకు రానున్నది. నార్జో ఎన్55 ఫోన్ ఆవిష్కరణ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్‌పై లైవ్ ప్రసారం కానున్నది. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ డాట్ ఇన్‌తోపాటు రియల్ మీ వెబ్సైట్లోనూ రియల్మీ నార్జో ఎన్55 ఫోన్లు లభిస్తాయి.
స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకోవడంలో ముందు ఉన్న రియల్మీ నార్జో ఎన్55 ఫోన్ డిజైన్ మరింత ఆకర్షణీయంగానూ, అడ్వాన్స్డ్ ఫీచర్లతో అందుబాటులోకి రానున్నది. మూడు స్టోరేజీ వేరియంట్లలోనూ, రెండు కలర్స్‌లో లభించనున్నది రియల్మీ నార్జో ఎన్55.
4జీబీ రామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ రామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, టాప్ టైర్ వేరియంట్ 8జీబీ రామ్ విత్ 128జీబీ స్టోరేజీ వేరియంట్‌ల్లో లభిస్తుంది. ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.
రియల్మీ నార్జో ఎన్55 ఫోన్ 90హెర్ట్ రీఫ్రెష్ రేట్ అమోల్డ్ స్క్రీన్, 64-మెగా పిక్సెల్ కెమెరా విత్ 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆప్షన్లతో వస్తున్నది. 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌గా ఉంటుంది. నార్జే ఎన్55 ఫోన్ ధర వెల్లడించకున్నా మిడ్ రేంజ్ రూ.15,999 నుంచి ధర ప్రారంభం అవుతుందని తెలుస్తున్నది.