Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జోగుళాంబ గద్వాల : ఇంటికి నీడనిస్తున్న చెట్టును నరకవద్దని అడ్డుకున్న తల్లిని ఓ కొడుకు గొడ్డలితో దాడి చేసి చంపిన విషాద ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటు చేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్ నాయక్ కథనం ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన నాగమ్మ(65) గ్రామపంచాయతీలో వర్కర్‌గా పనిచేస్తున్నది. శుక్రవారం ఇంటిముందు ఉన్న చెట్టును ఆమె కొడుకు ప్రేమరాజ్ గొడ్డలితో నరుకుతుండగా తల్లి అడ్డుకున్నది. దీంతో ఆగ్రహానికి గురైన కుమారుడు చేతిలో ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. మెడపై, కడుపులో నరకడంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలి మృతి చెందింది. స్థానికులు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ శివశంకర్, ఎస్సై శ్రీనివాస్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఆమెకు నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.