Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: సీనియర్ నటి కుష్బూ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోలను షేర్ చేసి తన ఆరోగ్య పరిస్థితి వివరించారు. ‘‘జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం అన్నీ వేధిస్తున్నాయి. అదృష్టవశాత్తు నేను మంచి ఆసుపత్రిలో చేరాను. ఆరోగ్యం కొంచెం బాలేకపోయినా దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. అలా పట్టించుకోకపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది’’ అని ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కుష్బూ తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల తెలుగులో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్2’ ట్రైలర్ విడుదల వేడుకకు హాజరయ్యారు. మణిరత్నంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.