Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో భారత్‌కు తిరిగివచ్చే ముందు అమృత్‌పాల్ సింగ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకునేందుకు జార్జియా వెళ్లిన్నట్లు విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిన వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలా పోలికలతో కనిపించేందుకు కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా చట్టంకింద అరెస్టయి ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న సింగ్ సన్నిహితులు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. సింగ్ జార్జియాలో దాదాపు రెండు నెలలు(20/6/22 నుంచి 19/8/22 వరకు) ఉన్నట్లు సమాచారం.
కాగా జర్నయిల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో హతమయ్యాడు. ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్‌గా ఉన్న అమృతపాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్‌వాలే తరహాలోనే తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు.