Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: వేసని ఇంకా రాకముందే భాను డి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ప్రకటించాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఎండలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. మధ్య భారతం నుంచి దక్షిణ భారతం వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. పశ్చిమ దిశగా వస్తున్న పొడిగాలులతో వాతావరణం వేడెక్కింది. శుక్రవారం కడపలో 40, అనంతపురంలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా శుక్రవారం కోస్తా, రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి జల్లులు కురవగా మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది.