Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వైద్యం, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం టీశాట్ ద్వారా ఎంసెట్ కోచింగ్ ఇస్తోంది. రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 5వ తేదీన శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎంసెట్‌కు సన్నద్ధమవ్వాలనుకుంటున్న పేద విద్యార్థులకు వేలాది రూపాయల రుసుములు చెల్లించి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకునే స్తోమత ఉండదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల రచయితలు, నిపుణులతో టీ శాట్ ద్వారా రోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎంసెట్ నిర్వహించే నాటికి సిలబస్ పూర్తయ్యేలా టైంటేబుల్ కూడా రూపొందించారు. శిక్షణ తీసుకుంటున్న ప్రతి విద్యార్థినికి ప్రత్యేక కోడ్ నంబరు కేటాయించి పీజీసీఆర్టీకి అనుసంధానించారు.