Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో బదిలీల పర్వం కొనసాగుతున్నది. శుక్రవారం 54 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 39 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి రెండు జీవోలను విడుదలచేశారు. ఏలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్‌కుమార్‌ను, గుంటూరు రేంజ్ ఐజీగా జీ. పాలరాజు, అనంతపురం డీఐజీగా ఆర్ఎన్ అమ్మిరెడ్డి, సెబ్ డీఐజీగా ఎం. రవిప్రకాశ్‌ను నియమించారు.
ఇక ఏపీఎస్పీ డీఐజీగా బీ. రాజకుమారి, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి, గ్రేహౌండ్స్ డీఐజీగా కోయ ప్రవీణ్, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీగా శంఖబ్రత బాగ్చీ, సీఐడీ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్, విశాఖపట్నం సిటీ కమిషనర్‌గా త్రివిక్రమ్ వర్మ, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా వాసన్ విద్యాసాగర్ నాయుడు, ఎస్ఐబీ ఎస్పీగా సుమిత్ సునీల్, 16వ బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖ కమాండెంట్‌గా గౌతమి సాలి, ఐదో బెటాలియన్ ఏపీఎస్పీ విజయనగరం కమాండెంట్‌గా రాహుల్‌దేవ్ శర్మ, మూడో బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా విజయరావు, సీఐడీ ఎస్పీగా వీ. హర్షవర్ధన్ రాజు, సీఐడీ ఎస్పీగా ఫకీరప్ప, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్, ఆక్టోపస్ ఎస్పీగా సిద్ధార్థ కౌశల్, ఏలూరు ఎప్పీగా డీ. మేరి ప్రశాంతి, తూర్పుగోదావరి ఎస్పీగా సీహెచ్ సుధీర్‌కుమార్, అల్లూరి సీతారామరాజు ఎస్పీగా తుహిన్ సిన్హా, కాకినాడ ఎస్పీగా ఎస్. సతీశ్ కుమార్‌ను బదిలీ చేశారు.