Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డుచెప్పారని తన ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..యువతి పరిస్థితి విషమంగా ఉంది. కూచ్ బెహర్కు చెందిన విభూతి భూషణ్ అనే యువకుడు.. ఇతి బర్మన్ అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసి వారి ప్రేమకు అడ్డు చెప్పారు. దీంతో పగపెంచుకున్న భూషణ్.. ఇతి బర్మన్ ఇంటికి మరో ఇద్దరితో కలిసి గురువారం రాత్రి వెళ్లాడు. పదునైన ఆయుధంతో ఇతి బర్మన్ కుటుంబంపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇతి సహా ఆమె తండ్రి బిమల్ బర్మన్, తల్లి నీలిమ, సోదరి రూనా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె తల్లి, తండ్రి, సోదరి మరణించారు.