Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి
రాజేంద్రనగర్‌లో విషాదం నెలకొంది. నందినీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఆమె తనువు చాలించింది. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి… ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ నందినీ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె శరీరంపై గాయాలు ఉన్నాయని, అతి దారుణంగా తమ బిడ్డను కొట్టి చంపేశారని వారు కన్నీరుమున్నీరయ్యారు. నందినీ చనిపోయిందని వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండంటూ భర్త రత్నదీప్ ఫోన్ చేయగా హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చిన ఆమె తల్లిదండ్రులు. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 304 బి సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందినీ భర్త రత్నదీప్‌ను అరెస్ట్ చేశారు. అత్త మామ విజయ, లక్ష్మణ్‌రావులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ బిడ్డను చంపడమే కాకుండా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని, కేసు వాపస్ తీసుకోకపోతే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నందినీ స్వస్థలం కర్ణాటకలోని బీదర్ జిల్లా.. పూర్తి సమాచారం అందవలసి ఉంది.