Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమరం వెంకటేశ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ట్విట్టర్ లో వెల్లడించింది. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చేరిన వెంకటేష్.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టిన వెంకటేష్.. ఫిలిం ఫెడరేషన్‌కు ప్రెసిడెంట్‌గా గెలుపొంది సేవలందించారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన షేర్ అనే చిత్రాన్ని కూడా ఈయనే నిర్మంచారు. చిత్రపురి కాలనీకి అధ్యక్షుడిగానూ వెంకటేశ్ పనిచేశారు. వెంకటేశ్ మృతిపట్ల పలువురు సీనీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.