Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగానలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ(ఎం) హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికి అనేక రాష్ట్రాల్లో ప్రారంభించిన వందేభారత్ రైలును మరోసారి హైదరాబాద్ లో ప్రారంభించాడానికి ప్రధాన మంత్రి రావాడం వింతగా వుందని సీపీఐ(ఎం) నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక ప్రశ్నాలను సందించారు.
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణికులకు కల్పించిన కొద్దిపాటి రాయితీలను రద్దు చేయడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి పెద్ద మొత్తంలో సహాయం పొందిన ఎల్ అండ్ టి సంస్థ ప్రయాణికుల నుండి మాత్రం ఒప్పందానికి విరుద్ధంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్నది, త్వరలో చార్జీలను పెంచాలని ప్రయత్నిస్తున్నది దీనికి మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని రాయితీలను పునరుద్ధరించి విద్యార్థులకు మెట్రో రైల్ పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాంలో కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీ.జీ నర్సింహరావు, టి.జ్యోతి, హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాం నాయక్, స్కైలాబ్ బాబు, బుర్రి ప్రసాద్, బండారు రవికుమార్, బాబురావు, సిఐటీయూ నాయకులు వంగూరు రాములు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగారాజు తదితర నాయకులు, కార్యకర్తలు పొల్గొన్నారు.