Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బాలీవుడ్ బ్యూటీ అమిషా పటెల్‌పై రాంచి సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కింద ఆమెపై 420, 120 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అమిషా, అమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్‌కు వ్యతిరేకంగా సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాలు.. అమీషా పటేల్‌కు చెందిన ‘దేశీ మ్యాజిక్’ చిత్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్‌గా రాంచీ జిల్లాలోని హర్ము ప్రాంత నివాసి అజయ్ కుమార్ సింగ్‌ను ఆమె సంప్రదించింది. దీంతో అజయ్ కుమార్ రూ.2.5కోట్లను అమీషా ఖాతాకు బదిలీ చేశాడు. మేకింగ్‌తో పాటు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని ఆయన అమిషాను కోరాడు. ఈ ఒప్పందం ప్రకారం ఆమె 2013లో ప్రాజెక్టును పట్టాలెక్కించింది. సినిమా షూటింగ్‌ను మాత్రం పూర్తి చేయలేదు. ఫలితంగా అజయ్ డబ్బును వెనక్కి ఇవ్వాలని నటిని పలు మార్లు కోరాడు. అక్టోబర్ 2018లో అమీషా రూ.2.5కోట్లకు ఒకటి, రూ.50లక్షలకు మరో చెక్‌ను ఇచ్చింది.
కానీ, ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయి. దీంతో అజయ్ సింగ్ ఆమెపై రాంచీ సివిల్ కోర్టులో అమిషా, ఆమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్పై కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు విచారణకు అమిషా హజరు కాగా ఆమె తరపు న్యాయవాది మాత్రం కోర్టుకు ముందు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అలాగే గతంలో రూ. 32.25 లక్షల చెక్ బౌన్స్ కేసులో భోపాల్ కోర్టు అమిషాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.