Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. ఇటీవల ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కార్ ఈ తరుణంలో ఐపీఎస్ లను కూడా బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 39 ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ 2 జీవోలను విడుదల చేసింది. అయితే గత నెలలోనే ఈ బదిలీలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ సీఎం జగన్ ఆమోదం లభించకపోవడంతో వాయిదా పడింది. దీంతో ఇప్పుడు భారీ ఎత్తున బదిలీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందించారు.