Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ తరుణంలో ఈసీ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు పెంచింది. అయితే ఈ తనిఖీల్లో భాగంగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక లోని దావణగెరె శివారులో గల హెబ్బళు టోల్ సమీపంలో ఈసీ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఓ బీఎండబ్ల్యూ కారులో భారీగా వెండి వస్తువులను గుర్తించారు. ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి ముంబయి తరలిస్తున్న ఈ వస్తువులకు సరైన పత్రాలు చూపించలేదు. దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కారు డ్రైవర్ సుల్తాన్ ఖాన్, వాహనంలో ఉన్న మరో వ్యక్తి హరి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.