Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ మాసం. ఈ నేపథ్యంలో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. హిందూపురంలోని అలీహిలాలా పాఠశాల గ్రౌండ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలయ్య వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ముస్లిం వేషధారణలో కనిపించారు. ముస్లింలను సన్మానించిన బాలయ్య, వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.