Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ముగించుకుని తిరిగి చెన్నైకు బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని శనివారం మధ్యాహ్నం చెన్నైకి విచ్చేస్తున్నారు. అయితే మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతాధికారులు స్వల్ప మార్పులు చేశారు. చెన్నైలో ఆయన నాలుగుచోట్ల జరిగే కార్యక్రమాలలో పాల్గొనున్నారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ రైల్వేస్టేషన్, మైలాపూరు శ్రీరామకృష్ణమఠం, పల్లావరం సైనిక మైదానంలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. నిర్దేశిత పర్యటన వివరాల మేరకు ఆయన మైలాపూరు శ్రీరామకృష్ణమఠంలో ఆ మఠం 125వ వార్షికోత్సవాల ముగింపు వేడుకలలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ మఠానికి వెళ్లే దారి ఇరుకుగాను, వేడుకలు జరిగే ప్రాంతం విస్తీర్ణం కూడా తక్కువగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మోడీ ఆ మఠం సందర్శనను రద్దు చేశారు. అదే సమయంలో శ్రీరామకృష్ణమఠం వేడుకలను మెరీనాబీచ్‌లో ఆ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివేకానందర్ ఇల్లమ్‌లో జరుపనున్నారు. ఆ మేరకు ప్రధాని మోడీ తొలుత సెంట్రల్ రైల్వేస్టేషన్లో చెన్నై - కోయంబత్తూరు వందేభారత్ రైలు సర్వీసును ప్రారంభించిన తర్వాత అక్కడి నుండి నేరుగా వివేకానందర్ ఇల్లమ్ చేరుకుని అక్కడ జరిగే శ్రీరామకృష్ణమఠం 125వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. కాగా ప్రధాని మోడీ చెన్నై పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.