Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రవిబాబు విలన్ గా .. కామెడీ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడిగా కూడా ఆయన తనదైన మార్క్ ను చూపిస్తూ ఉంటాడు. ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు ఆయన నుంచి వచ్చాయి. ఆయన పూర్ణ కాంబినేషన్లో చేసిన 'అవును' అప్పట్లో పెద్ద హిట్.
ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే 'అసలు'. ఈ సినిమాను 'ఈటీవీ విన్' లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబధించిన ట్రైలర్ ను కొంతసేపటికి క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రొఫెసర్ చక్రవర్తి మర్డర్ మిస్టరీ కేసును ఛేదించడానికి రవిబాబు రంగంలోకి దిగుతాడు. ఈ కేసు విషయంలో నలుగురు వ్యక్తులపై ఆయనకి అనుమానం కలుగుతుంది. ఆ నలుగురు ఎవరు ? 'అసలు' హంతకులు ఎవరు? అనేదే కథ. ఈ సినిమాకి రవిబాబు రచయితగా .. నిర్మాతగా వ్యవహరించగా, ఉదయ్ - సురేశ్ దర్శకత్వం వహించడం విశేషం.